![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 314 లో.. కావ్య ఒంటరిగా కూర్చొని రాజ్ వేరొక అమ్మాయితో క్లోజ్ ఉన్నదంతా గుర్తుకుచేసుకొని బాధపడుతుంటుంది. అప్పుడే రాజ్ కావ్య దగ్గరికి వచ్చి.. ఏమైంది హాస్పిటల్ కి వెళ్ళావంట.. ఇప్పుడు ఎలా ఉందని అడుగగానే... కావ్య మనసులో దుఃఖాన్ని ఆపుకొని బాగుందని చెప్తుంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బిజీగా ఉన్నానని రాజ్ అనగానే.. మీరు ఎంత బిజీగా ఉంటారో నేను ఉహించగలనని కావ్య చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది.
ఇంట్లో రుద్రాణి పెట్టిన చిచ్చుతో వాళ్ళ తోటికోడళ్ళ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇన్ని రోజులుగా ఎప్పుడైనా కళ్యాణ్, రాజ్ లని వేరు వేరుగా చూసానా అని సుభాష్ తో అపర్ణ అనగానే.. అసలేమైంది? ఎందుకు అంత కోపంగా ఉన్నావని సుభాష్ అడుగుతాడు. నేను కళ్యాణ్ కి ఒక పనిచెప్తే.. నీ తమ్ముడి భార్య నేను కళ్యాణ్ ని పని వాడిలాగా చూస్తున్నానని అంటుందని ఆవేశంగా మాట్లాడుతుంది. ధాన్యలక్ష్మి అన్న దాంట్లో తప్పు లేదనిపిస్తుంది. ఇన్ని రోజులు కళ్యాణ్ వేరు.. ఇప్పుడు వేరు.. వాడికి పెళ్లి అయింది కదా.. వాడి పెళ్ళాం ముందు వాడిని తక్కువ చెయ్యొద్దని తల్లిగా ధాన్యలక్ష్మి అనుకుంటుందని సుభాష్ అంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి.. నాకు భయపడే ధాన్యలక్ష్మి.. ఇప్పుడు నాతోనే డైరెక్ట్ గా ఆ మాట అనేసరికి నేను తట్టుకోలేకపోతున్నానని అనేసి అపర్ణ కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకొకవైపు ధాన్యలక్ష్మి కూడా ప్రకాష్ తో మాట్లాడతుంది. మన కొడుకుని ఇంట్లో పనివాడిని చేశారు. మీ వదిన వాడికి పని చెప్తుందని అనగానే.. ప్రకాష్ కోపంగా ఇన్ని రోజులు చెప్పలేదా.. ఈ ఇంట్లో అందరు రాజ్ , కళ్యాణ్ లని సమానంగా చూస్తారని అనగానే ధాన్యలక్ష్మి కోపంగా వెళ్తుంది.
ఆ తర్వాత కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి.. మీరు ఎందుకు డల్ గా ఉంటున్నారని అడుగుతాడు. ఏం లేదని కావ్య అంటుంది. మీరిప్పుడు ఎందుకు బాధపడుతున్నారో చెప్పకుంటే.. నా మీద ఒట్టే అనగానే కావ్య తన ఫోన్ లో రాజ్ శ్వేత ఫోటో చూపిస్తుంది. ఈ అమ్మయి శ్వేత.. అన్నయ్య క్లాస్ మేట్ అన్నయ్యని లవ్ చేసింది. అన్నయ్య చేసాడో లేదో తెలియదని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు ఈ అమ్మయి మళ్ళీ మీ అన్నయ్య జీవితంలోకి వచ్చిందని కావ్య అనగానే.. కళ్యాణ్ షాక్ అవుతాడు. అప్పుడే అనామిక వస్తుంది. ఏంటి ఏదో మాట్లాడుకుంటూ ఆగిపోయారని అడుగుతుంది. ఏం లేదంటు కావ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. నా గురించే మాట్లాడుకుంటున్నారా అని కళ్యాణ్ ని అనామిక అడుగుతుంది. లేదంటూ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనామిక దగ్గరకి రుద్రాణి వచ్చి.. వాళ్ళు చెప్పింది నమ్మావా.. వాళ్ళు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. కావ్య ఎలాగైనా నీపై కళ్యాణ్ కి ద్వేషం పెంచి.. అప్పుని ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటుందని ఉన్నవి లేనివి కావ్యపై కోపం కలిగేలా అనామికకి చెప్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరకి రాజ్ వచ్చి.. తిన్నావా అని అడుగుతాడు. తరువాయి భాగంలో కావ్య భోజనం చెయ్యలేదని తెలిసి రాజ్ భోజనం తీసుకొని వచ్చి.. కావ్య చేతులు కట్టేసి ప్రేమగా అన్నం తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |